క్రేజీ బజ్ : కోలీవుడ్ స్టార్ హీరోతో ‘కస్టడీ’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ?

Published on May 16, 2023 2:01 am IST

తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కస్టడీ. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం బాగానే కలెక్షన్ రాబడుతోంది. తెలుగు, తమిళ్ బైలింగువల్ గా రూపొందిన కస్టడీ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

ఇక కస్టడీ సక్సెస్ తో డైరెక్టర్ వెంకట్ ప్రభు నెక్స్ట్ మూవీ పై అందరిలో బాగా ఆసక్తి ఏర్పడింది. ఇక తాజాగా కోలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఆయన తన నెక్స్ట్ మూవీని స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తో చేయనున్నారని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ కెరీర్ 68వ మూవీగా రూపొందనున్న దీని గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :