లేటెస్ట్ : ఆకట్టుకుంటున్న ‘కస్టడీ’ అండర్ వాటర్ సీక్వెన్స్ మేకింగ్ వీడియో

Published on May 11, 2023 11:51 pm IST


అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ రేపు గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించగా గ్రాండ్ లెవెల్లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కస్టడీ మూవీ నుండి తాజాగా అండర్ వాటర్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోని యూట్యూబ్ లో విడుదల చేసారు. సినిమాలో ఎంతో కీలకమైన ఈ సీన్ కోసం హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి సహా మరికొందరు టీమ్ ఎంతో కష్టపడడం వీడియోలో చూడవచ్చు. మొత్తంగా కస్టడీ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని బాక్స్ఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :