‘కస్టడీ’ రియలిస్టిక్ యాక్షన్ ఫిలిం – డైరెక్టర్ వెంకట్ ప్రభు

Published on May 4, 2023 2:55 am IST

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మే 12న గ్రాండ్ గా తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని మే 5 న విడుదల చేయనున్నారు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక నేడు కస్టడీ మూవీ మీడియా మీట్ నిర్వహించింది.

ఇందులో భాగంగా దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, కస్టడీ మూవీ కోసం హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి సహా టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమా రియలిస్టిక్ యాక్షన్ తో సాగుతుందని, ప్రతి పాత్ర యొక్క పెర్ఫార్మన్స్ తో పాటు సీన్స్ అన్ని కూడా ఆడియన్స్ కి రియలిస్టిక్ ఫీల్ ని అందిస్తాయని తెలిపారు. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా తెలుగు ఆడియన్స్ ముందుకి వస్తున్న తనని ఇక్కడి ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు వెంకట్ ప్రభు.

సంబంధిత సమాచారం :