ఫాస్టెస్ట్ 400K లైక్స్ సాధించిన “దాక్కో దాక్కో మేక సాంగ్”

Published on Aug 13, 2021 4:22 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా కనిపించనున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి, ఫస్ట్ గ్లింప్స్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదల అయింది. ఈ ఫస్ట్ సింగిల్ అన్ని బాషల్లో రికార్డు లను కొల్లగొడుతుంది.

దాక్కో దాక్కో మేక అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట 182 నిమిషాల్లో 400K లైక్స్ ను సాధించడం జరిగింది. ఇప్పటి వరకూ ఈ తరహా ఫీట్ ను ఏ ఒక్క వీడియో కూడా సాధించలేదు అని చెప్పాలి. అంతేకాక ఈ పాట అన్ని బాషల్లో కూడా 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను దక్కించుకొని భారీ వ్యూస్ సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి పార్ట్ ను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

దాక్కో దాక్కో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :