తెలుగు రాష్ట్రాల్లో “డాకు మహారాజ్” 3 రోజుల్లో అదిరే వసూళ్లు!

తెలుగు రాష్ట్రాల్లో “డాకు మహారాజ్” 3 రోజుల్లో అదిరే వసూళ్లు!

Published on Jan 15, 2025 2:04 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకొని అదరగొట్టింది. అలాగే ఇపుడు మొత్తం మూడు రోజుల మంచి నంబర్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. అలా పిఆర్ నంబర్స్ ప్రకారం డాకు మహారాజ్ లెక్కలు ఇలా ఉన్నాయి.

నైజాం – 2.17 కోట్లు
సీడెడ్ – 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.27 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
కృష్ణ – 0.57 కోట్లు
తూర్పు గోదావరి – 0.70 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.52 కోట్లు
నెల్లూరు – 0.32 కోట్లు

మొత్తం 7.87 కోట్లు షేర్ ని అందుకుని మూడు రోజులు కలిపి 38.69 కోట్ల షేర్ ఈ మూడు రోజుల్లో అందుకొని బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు