లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చి అదరగొట్టిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా “డాకు మహారాజ్” కూడా ఒకటి. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బాలయ్య కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది.
అయితే ఈ సినిమా దర్శకుడు కొల్లి బాబీ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. డాకు మహారాజ్ సినిమాని తన స్వస్థలం గుంటూరులో సంగీత దర్శకుడు థమన్ తో అది కూడా మైత్రి సినిమాస్ వారి థియేటర్ లో చూడడం అనేది ఎంతో ఆనందంగా మధురానుభూతిని కలిగించింది అని తను తెలిపి పలు ఫొటోస్ కూడా షేర్ చేసారు. అలాగే థియేటర్ లో బాలయ్య గారి అభిమానులు ఇచ్చిన రెస్పాన్స్ తో మాకు మరింత ఎనర్జీ వచ్చింది అంటూ తెలిపారు.
Watched our #BlockbusterHuntingDaakuMaharaaj in my hometown, Guntur, with my darling @MusicThaman at @MythriCinemas, and it was an unforgettable experience! ????
The electrifying response from Balayya Garu’s fans truly energized us. ???????? Feeling incredibly blessed to receive such… pic.twitter.com/evh6lGEvjU
— Bobby (@dirbobby) January 16, 2025