‘డాకు మహారాజ్’ విషయంలో క్లారిటీ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్

‘డాకు మహారాజ్’ విషయంలో క్లారిటీ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్

Published on Feb 17, 2025 7:00 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలయ్య తన నటవిశ్వరూపంతో ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాడు. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం వేరే లెవెల్.

అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ సినిమా ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనే విషయంపై సందేహం నెలకొంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ఓ క్లారిటీ ఇచ్చింది.

‘డాకు మహారాజ్’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. దీంతో ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు