మన టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” సాలిడ్ హైప్ నడుమ ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎదురు చూశారు. ఇలా ఫైనల్ గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
ఇలా ఫైనల్ గా నార్త్ లో డాకు మహారాజ్ ని రిలీజ్ కి మేకర్స్ సిద్ధం చేశారు. హిందీలో ఈ జనవరి 24 నుంచి థియేటర్స్ లో బాలయ్య సందడి చేయనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై అభిమానులు హిందీలో ఈ కొంచెం గ్యాప్ లో అయినా ప్రమోషన్స్ చేయాలని కోరుకుంటున్నారు. మరి హిందీలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.