సీడెడ్‌లో దూసుకుపోతున్న ‘డాకు మహారాజ్’ !

సీడెడ్‌లో దూసుకుపోతున్న ‘డాకు మహారాజ్’ !

Published on Jan 13, 2025 4:00 PM IST

సీడెడ్‌లో డాకు మహారాజ్ నిన్న థియేటర్లలోకి వచ్చి మంచి స్పందనను రాబట్టింది. ముఖ్యంగా సీడెడ్‌ లో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు సీడెడ్‌లో రూ. 7 కోట్ల భారీ వసూళ్లను సాధించింది, రూ. 5.35 కోట్ల (GST మినహాయించి) షేర్ ను రాబట్టడం విశేషం. బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా కీలక పాత్రలు పోషించారు.

కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొత్తం ఏపీ – తెలంగాణలో కూడా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. అన్నట్టు రాబోయే రోజుల్లో ఈ సినిమాకి ఇంకా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు