ప్రపంచంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఫ్రెండ్ షిప్(స్నేహ బంధాని)కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఇండస్ట్రీలోనూ, మరియు బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ చరణ్ ని నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మా నాన్నగారే నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు.
రామ్ చరణ్ తనకి ఎలాంటి అడ్వైజ్ కావాలన్నా, ఏ విషయంలో అయినా గైడెన్స్ కావాలన్నా ముందుగా అప్రోచ్ అయ్యేది మెగాస్టార్ చిరంజీవినే అని అంటున్నారు. ‘నాన్న నా మీద తీసుకునే కేర్ కి నేను థ్రిల్ అవుతూ ఉంటాను. ఆయాల ఎంత బిజీలో ఉన్నా నా ఫోన్ కాల్ కి రెస్పాన్స్ ఇవ్వకుండా మాత్రం ఉండరు’ అని తాజాగా రామ్ చరణ్ ఓ పత్రికకి చెప్పారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ‘గోవిందు అందరివాడెలే’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కృష్ణవంశీ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
