దగ్గుబాటి ఫ్యామిలి నుండి మరో హీరో !
Published on Oct 21, 2017 2:56 pm IST


తెలుగు తెరకు మ‌రో కొత్త హీరో ప‌రిచ‌యం కాబోతున్నాడు. ద‌గ్గుబాటి కుటుంభం నుంచి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, రానాలు తెలుగు తెర‌పై రాణిస్తుండ‌గా తాజాగా ద‌గ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, రానా సోద‌రుడు అయిన అభిరామ్ తెలుగు ఇండ‌స్ట్రీలో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి స‌న్నాహాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. వివరాల్లోకి వెళ్ళితే…

గతంలో మోహన్ బాబు, శర్వానంద్ తో ‘రాజు మహారాజు’ చిత్రానికి దర్శకత్వం వహించిన ‘భాను శంకర్’ అభిరామ్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. త్వరలో ఈ సినిమాకు సంభందించి అధికారిక ప్రకటన రానుంది.

 
Like us on Facebook