వెంకటేష్ కోసం చరణ్ డైరెక్టర్ ప్రయత్నం ?

వెంకటేష్ కోసం చరణ్ డైరెక్టర్ ప్రయత్నం ?

Published on Mar 27, 2022 11:04 PM IST

డైరెక్టర్ సంపత్ నంది విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ కి సంపత్ నంది ఓ కథ చెప్పాడని, వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. డైరెక్టర్ ‘సంపత్ నంది’ను వెంకటేష్ దగ్గరకు పంపింది మిర్యాల రవీందర్ రెడ్డినే అని టాక్ నడుస్తోంది.

మరి వెంకటేష్ ఇమేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య సంపత్ నంది రవితేజతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వెంకటేష్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది ఫీల్ అవుతున్నాడట. ఏది ఏమైనా వెంకటేష్ కొత్త సినిమాల పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు