‘భీమ్లా’ వర్సెస్ ‘డానియల్’..ల్యాండింగ్ కి డేట్ ఫిక్స్.?

Published on Sep 15, 2021 4:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. మళయాళ సూపర్ హిట్ “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే ఇటీవల వచ్చిన ఆల్ మోస్ట్ అన్ని అప్డేట్స్ కూడా పెద్ద హంగామా లేకుండా సడెన్ గా వచ్చినవే అని చెప్పాలి. మరి అలానే ఇంకో అప్డేట్ వస్తుందా అని బజ్ వినిపిస్తుంది. అదే రానా కి సంబంధించిన అప్డేట్ పై.. మరి ఇందులో పవన్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే రానా రోల్ కి కూడా ఉంటుంది.

మరి తన రోల్ ని పరిచయం చేస్తూనే డిజైన్ చేసిన గ్లింప్స్ లేదా పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. అయితే దానిని బహుశా ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ చెయ్యొచ్చనే బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. అంటే వచ్చే సెప్టెంబర్ 17న భీమ్లా శత్రువు డానియల్ శేఖర్ ల్యాండ్ అవ్వనున్నట్టు టాక్. దానిపై మాత్రం మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి హింట్స్ స్టార్ట్ కాలేదు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :