ఇండియన్ సూపర్ స్టార్ రజినీకి తెలుగులో కూడా కోలీవుడ్ కి సమానంగా ఫాలోయింగ్ ఉంది. దశాబ్దాల పాటు ఆయన సినిమాలు తెలుగు తెరపై వసూళ్ల వర్షం కురిపించాయి. భాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, రోబో ఇలా అనేక సినిమాలు తెలుగు బాక్సాపీస్ ని దున్నేశాయి. కాగా ఆయన లేటెస్ట్ మూవీ దర్బార్ ప్రీ రిలీజ్ బిసినెస్ గట్టిగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 14కోట్ల వరకు జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం రజిని కి ఉన్న క్రేజ్ రీత్యా ఈ మొత్తం కొంచెం ఎక్కువనే చెప్పాలి.
గత కొంత కాలంగా రజిని చిత్రాలు తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. రోబో చిత్రం తరువాత ఆయన నటించిన ఈ చిత్రం తెలుగులో ఆదరణ దక్కించుకోలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 కూడా అనుకున్నంతగా ఆడలేదు. కాబట్టి 14కోట్ల వసూళ్లు రాబట్టాలి అంటే దర్బార్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజినీకి హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా..యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
