“డార్లింగ్” నాన్ థియేట్రికల్ రైట్స్ డీటైల్స్ ఇవే!

“డార్లింగ్” నాన్ థియేట్రికల్ రైట్స్ డీటైల్స్ ఇవే!

Published on Jul 9, 2024 6:01 PM IST

టాలీవుడ్ నటుడు, కమెడియన్ ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. జూలై 19, 2024న థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అశ్విన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి కలిగించే విధంగా ఉంది.

లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ మా గ్రూప్ భారీ ధరకు సొంతం చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉండగా, స్టార్ మా ఛానెల్ శాటిలైట్ హక్కులను 6 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. నభా నటేష్ మరియు ప్రియదర్శితో పాటుగా అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, బ్రహ్మానందం, కళ్యాణి రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు