తీవ్ర ఒత్తిడిలో దర్శన్‌, రోదిస్తున్న పవిత్రా గౌడ

తీవ్ర ఒత్తిడిలో దర్శన్‌, రోదిస్తున్న పవిత్రా గౌడ

Published on Jun 24, 2024 3:31 PM IST

హీరోయిన్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ స్టార్ హీరో దర్శన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఐతే, అరెస్టయిన దర్శన్‌కు పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయిస్తూ.. విచారణ ఖైదీగా 6106 నంబరును కేటాయించారు. రాత్రి భోజనానికి రాగి సంగటి, అన్నం, సాంబారు మజ్జిగ, ఆకుకూర పులుసు ఇస్తున్నారు.

ఐతే, దర్శన్‌ మాత్రం రాత్రి అరకొరగా అన్నం తిని, ఆలస్యంగా నిద్రపోతున్నారట. హత్య కేసులో తాను అరెస్టయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయిందని దర్శన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట. పైగా దర్శన్‌ బరువు కొంత తగ్గగా, అతని రక్తపోటు కూడా నియంత్రణలో లేదని తెలుస్తోంది. ఇక మహిళా బ్యారక్‌లో ఉన్న పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా, ఒంటరిగా , రోదిస్తూ ఉంటోందని తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు దర్శన్‌ మెడకు చుట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు