కొండపొలం నుంచి “దారులు దారులు” సాంగ్ రిలీజ్..!

Published on Oct 2, 2021 10:07 pm IST


మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “దారులు దారులు” అనే లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా, కీరవాణి, హారిక నారాయణ్ ఆలపించారు. ఇకపోతే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :