‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Published on Mar 30, 2023 4:52 pm IST

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ అందించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ బాగా కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ నేటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. కాగా ఈ ఫస్ట్ వీక్ లో మొత్తంగా దాస్ కా ధమ్కీ మూవీ రూ. 21.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అజయ్, రావు రమేష్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, తరుణ్ భాస్కర్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :