ఇంటర్వ్యూ : నివేదా పేతురాజ్ – ‘దాస్ కా ధమ్కీ’ విశ్వక్ సేన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది

ఇంటర్వ్యూ : నివేదా పేతురాజ్ – ‘దాస్ కా ధమ్కీ’ విశ్వక్ సేన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది

Published on Mar 20, 2023 8:30 PM IST

యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దాస్ కా ధమ్కీ. యువ అందాల నటి వినేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా విశ్వక్ సేన్ సినిమాస్, వన్మయి క్రియేషన్స్ సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మించాయి. ఇప్పటికే దాస్ కా ధమ్కీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచిన సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా మార్చి 22న పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి మీడియాకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు హీరోయిన్ నివేదా పేతురాజ్

 

పాగల్ తర్వాత మళ్ళీ విశ్వక్ సేన్ తో పని చేయడం ఎలా అనిపిస్తోంది ?
పాగల్ చేస్తున్నప్పుడే ఓరి దేవుడా కి కాల్ వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత ధమ్కీ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. చాలా యూనిక్ కథ. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ మూవీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను.

 

పాగల్ విశ్వక్ హీరోగా చేశారు, కానీ ఇందులో హీరోతో పాటు దర్శకుడు నిర్మాతగా కూడా చేశారు కదా ఎలా అనిపించింది ?
హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ దర్శకత్వం ఒక ప్రధాన భాద్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు భాద్యతలని తీసుకున్నారు విశ్వక్. నిర్మాతగా పూర్తి న్యాయం చేశారు. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఇక దర్శకుడిగా అయితే విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాను. తప్పకుండా తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను.

 

ఎన్టీఆర్ గారు విశ్వక్ ని దర్శకత్వం ఆపేయాయాలని అన్నారు కదా ?
విశ్వక్ గొప్ప ఎనర్జీ వున్న దర్శకుడు. తన దగ్గర చాలా అద్భుతమైన పాయింట్స్ వున్నాయి. అయితే తానే నటుడిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేయాలని నా అభిప్రాయం. విశ్వక్ లో చాలా మాస్ వుంది. లోకేష్ కనకరాజ్ లాంటి టచ్ వుంది. బాలకృష్ణ గారు లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో వుంది. తనకి గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్ స్టర్ డైరెక్టర్ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి. అటువంటి సినిమాలు నేడు ఆడియన్స్ ఆదరిస్తున్నారు కూడా.

 

రావు రమేష్, రోహిణి గారితో పనిచేయడం ఎలా అనిపించింది ?
రావు రమేష్ గారు, రోహిణి గారు ఇందులో వున్నా అందరితో నాకు సీన్స్ వున్నాయి. అందరూ అద్భుతంగా చేశారు. రోహిణీ గారు అద్భుతమమైన నటి. కేవలం కళ్ళతోనే నటించగలదు. ఇందులో ఒక ఒక సీన్ వుంది. కేవలం వీల్ చైర్ లో కూర్చుని డైలాగ్ లేకుండా కూడా కన్నీళ్లు తెప్పించే సీన్ అది. అలానే రావు రమేష్ గారు కూడా సూపర్ గా పెర్ఫార్మ్ చేసారు. తప్పకుండా ఇద్దరి పాత్రలు ఆడియన్స్ ని అలరిస్తాయి.

 

‘దాస్ కా ధమ్కీ’పై మీ అంచనాలు ఏమిటి ?
దాస్ కా ధమ్కీ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. విశ్వక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. అలాగే దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది. తన డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ ఇందులో సూపర్.

 

‘దాస్ కా ధమ్కీ’ బలాలు ఏమిటి ?
దాస్ కా ధమ్కీ కి ప్రధాన బలం కథ. తర్వాత నటీనటులు. రావు రమేష్ గారు చాలా అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలానే స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని నమ్మకం ఉంది.

 

దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ?
ఉంది కానీ ఇప్పుడే కాదు. నిర్మాణం మాత్రం చేసే ఆలోచన లేదు. (నవ్వుతూ) నటనతో పాటు బిజినెస్ పై కూడా ద్రుష్టి పెడుతున్నా, ఇటీవల చెన్నయ్ లో రెస్టారెంట్ ఒకటి ప్రారంభించా. తప్పకుండా అన్ని కలిసి వస్తే రాబోయే రోజుల్లో దర్శకత్వం వహిస్తాను.

 

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?
సుస్మిత గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. హిందీ టీ సిరిస్ లో ఒక సినిమా చేస్తున్నాను, ఇప్పటికి అయితే ఇంతే.

థాంక్యూ, ఆల్ ది బెస్ట్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు