వరల్డ్ వైడ్ “దసరా” 2 రోజుల భారీ వసూళ్లు.!

Published on Apr 1, 2023 12:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా తన మాస్ ట్రాన్స్ ఫార్మేషన్ తో లేటెస్ట్ గా చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “దసరా”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా అయితే అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి భారీ హిట్ అండ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అందుకోగా ఇక రెండో రోజుకి అయితే ఏకంగా ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని దాటేసింది.

మరి రెండు రోజుల్లో అయితే ఈ సినిమా 53 కోట్ల మాసివ్ మార్క్ ని టచ్ చేసినట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో ఇది నాని కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 50 కోట్ల గ్రాసర్ గా నిలవగా స్యూర్ షాట్ 100 కోట్ల గ్రాస్ వైపుగా అయితే ఇప్పుడు ఈ సినిమా దూసుకెళ్తుంది. ఇక ఈ సాలిడ్ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :