“దసరా” మరో చార్ట్ బస్టర్ కి సాలిడ్ రెస్పాన్స్.!

Published on Mar 12, 2023 12:04 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “దసరా” కోసం తెలిసిందే. నాని నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా అలాగే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రం కూడా ఇదే కావడంతో భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ సినిమా సాంగ్స్ కూడా ఒకొకటిగా రిలీజ్ చేస్తున్నారు.

అలా రీసెంట్ వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ మంచి చార్ట్ బస్టర్ అయ్యింది. జస్ట్ కొన్ని రోజులు కితమే వచ్చిన మూడో పాట ఇప్పుడు 10 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ అవుతూ అదరగొడుతుంది. మొత్తానికి నాని పాన్ ఇండియా ఎంట్రీ అన్నీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి. మరి ఈ మార్చ్ 30న రిలీజ్ కి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ భారీ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :