తెలుగు స్టేట్స్ లో “దసరా” కి కూడా అదిరే ప్లానింగ్స్.?

Published on Mar 24, 2023 10:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా మాస్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలు అయితే సెట్ చేసుకుంది. ఇక ఈ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా వైడ్ నిరంతరాయంగా అయితే ప్రమోషన్స్ చేస్తుండగా మేకర్స్ ఇక తెలుగు స్టేట్స్ లో రిలీజ్ కి అదిరే మూవ్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

కొన్ని వారాల కితం “సార్”, “వినరో భాగ్యము” లాంటి సినిమాలు రిలీజ్ ముందు రోజే పైడ్ ప్రీమియర్స్ అయితే ఎలా ప్లాన్ చేసారో దసరా కి కూడా ఈ తరహా ప్లానింగ్స్ ఉండే ఛాన్స్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా మార్చ్ 30 రిలీజ్ రోజున కూడా తెల్లవారు జాము షోస్ ఉండొచ్చని కూడా తెలుస్తుంది. మరి వీటిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :