సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “దసరా”..రిలీజ్ కి రెడీ..!

Published on Mar 17, 2023 11:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “దసరా”. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ రీసెంట్ గా సినిమాని సెన్సార్ కి పంపారు. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం సెన్సార్ ని కంప్లీట్ చేసేసుకుంది.

మొత్తం 2 గంటల 38 నిమిషాల నిడివి గల ఈ సినిమాకి అయితే యూ/ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ సభ్యులు ఇచ్చారు. దీనితో ఇక సినిమా రిలీజ్ కి చాలా టైం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్లానింగ్ తో అయితే రిలీజ్ కి ఈ సినిమా సిద్ధం అయ్యిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ మార్చ్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :