వైరల్ : భారత్, ఆసీస్ మ్యాచ్ లో అదరగొట్టిన “దసరా” ధరణి.!

Published on Mar 19, 2023 2:01 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ చిత్రం “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా మరో సహజ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇది. మరి ఈ సినిమా కోసం మేకర్స్ అయితే సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేస్తున్నారు. మరి అలా పాన్ ఇండియా వైడ్ అదిరే ప్రమోషన్స్ చేస్తున్న తాము లేటెస్ట్ గా అయితే ఈరోజు జరగనున్న భారత్ మరియు ఆసీస్ వన్డే మ్యాచ్ లో ప్రమోషన్స్ కోసం గాను వెళ్లారు.

మరి వైజాగ్ లో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సంశయంలో అయితే వరుణుడు కూడా కనికరించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ ఫుల్ గా స్టేడియం లోకి వెళ్లడం పైగా గ్రౌండ్ లో అక్కడి కామెంట్రేటర్స్ తో ధరణి షర్ట్ తో నాని మాట్లాడ్డం కూడా జరిగింది. దీనితో చిత్ర యూనిట్ అయితే ఆ తాలూకా ఫోటోలు రిలీజ్ చేశారు. మరి ఈ రేంజ్ లో అయితే దసరా కి కావాల్సిన సాలిడ్ హైప్ దక్కుతుండగా ఇక సినిమా సక్సెస్ అందుకోవడమే తరువాయి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :