ఆకట్టుకుంటున్న ‘దసరా’ మూవీ ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ ప్రోమో

Published on Mar 6, 2023 4:39 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా భారీ పాన్ ఇండియన్ మూవీ దసరా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈమూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దసరా మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇక నేడు ఈ మూవీ నుండి చమ్కీల అంగీలేసి అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. రామ్ మిరియాల, ఢీ కలిసి పాడిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో మంచి వ్యూస్ అందుకుంటుండగా ఫుల్ సాంగ్ ని మార్చి 8న రిలీజ్ చేయనున్నారు. కాగా మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ మార్చి 30న పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :