వైరల్ వీడియో : నాచురల్ స్టార్ కి ‘దసరా’ టీమ్ ధూమ్ ధామ్ బర్త్ డే విషెస్

Published on Feb 24, 2023 9:42 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దసరా. యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని కూడా ఆ అంచనాలు మరింతగా పెంచాయనే చెప్పాలి.

ఇక విషయం ఏమిటంటే, నేడు నాని పుట్టిన రోజు సందర్భంగా దసరా టీమ్ ధూమ్ ధామ్ అనే రేంజ్ లో ఒక చిన్న వీడియో బైట్ ద్వారా విషెస్ తెలియచేసింది. మా సినిమాలో ధరణి రోల్ పోషిస్తున్న నాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా స్టార్ గా భారీ సక్సెస్ అందుకోవాలని కోరుతూ యూనిట్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కాగా దసరా మూవీ మార్చి 30న గ్రాండ్ గా పలు భాషల ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :