త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “దసరా”

Published on Sep 15, 2023 12:01 am IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

త్వరలో ఈ సినిమా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం కానుంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :