“దసరా” హిందీ ప్రీమియర్ కి సిద్ధం.!

Published on Sep 1, 2023 9:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాసివ్ పాన్ ఇండియా చిత్రం “దసరా”. మరి ఈ ఏడాదిలో మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా నాని కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా అలానే బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలచి నానికి కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో చూపించింది.

మరి అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు హిందీలో అయితే వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. మరి హిందీలో అయితే ఈ సెప్టెంబర్ 3న కలర్స్ సినీ ప్లెక్స్ లో ప్రసారం అవుతుంది అని స్వయంగా నాని హిందీ వెర్షన్ కోసం బైట్ ఇవ్వడం జరిగింది. అయితే హిందీలో ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇక స్మాల్ స్క్రీన్ పై రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :