తెలుగు రాష్ట్రాల్లో “దసరా” మొదటిరోజు రికార్డు ఓపెనింగ్స్.!

Published on Mar 31, 2023 10:59 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మాస్ చిత్రం “దసరా” కోసం తెలిసిందే. నాని తన కెరీర్ లో ఏ సినిమాకి కష్టపడని విధంగా అయితే ఈ సినిమా నిన్న మాసివ్ రిలీజ్ కాగా వసూళ్లు కూడా అనుకున్నట్టుగానే రికార్డు మొత్తంలో నమోదు చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

మరి ఆల్రెడీ నైజాం లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు తెలుస్తున్నాయి. మరి ఈ సినిమా డే 1 కి అయితే 13.5 కోట్ల షేర్ ని అయితే తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. దీనితో ఇది నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డు గా నిలవడమే కాకుండా టైర్ 2 హీరోస్ లో అయితే ఆల్ టైం రికార్డు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :