యూఎస్ లో మాసివ్ ప్రీమియర్స్ నెంబర్ తో “దసరా”.!

Published on Mar 30, 2023 8:02 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “దసరా” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు భారీ ప్రమోషన్స్ నడుమ అయితే ఈరోజు ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా అయితే అనుకున్నట్టుగా యూఎస్ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అయితే అందుకుంది అని చెప్పాలి.

జస్ట్ ప్రీమియర్స్ తోనే అయితే ఈ సినిమా లేటెస్ట్ గా హాఫ్ మిలియన్ మార్క్ ని అయితే దాటేసింది. యూఎస్ డిస్ట్రిబూస్టర్స్ సమాచారంతో అయితే ఈ సినిమా 5 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని జస్ట్ ప్రీమియర్స్ తోనే రాబట్టినట్టు కన్ఫర్మ్ చేశారు. దీని బట్టి అయితే ఈ సినిమా రాంపేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :