నాని ‘దసరా’ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 10, 2023 2:15 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దసరా. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలానే కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన దసరా టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించి మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక ఈ మూవీ నుండి రానున్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న ఓరి వారి అనే పల్లవితో సాగె హార్ట్ బ్రేకింగ్ ఆంథం ని రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దానితో పాటు ఆ సాంగ్ కి సంబందించి రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా దసరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మార్చి 30న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :