వైజాగ్ లో “దసరా” యూనిట్..ప్రమోషన్స్ జరిగేనా?

Published on Mar 19, 2023 11:14 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “దసరా”. భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా అగ్రెసివ్ ప్రమోషన్స్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా అయితే వారు ఇప్పుడు వైజాగ్ కి చేరుకున్నారు. మరి వైజాగ్ లో నేడు జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అయితే మేకర్స్ తమ ప్రమోషన్స్ ని మంచి ప్లాన్ తో చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ప్రమోషన్స్ వైజాగ్ లో అనుమానకరంగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పరిస్థితి సరిగ్గా లేదు పైగా ఈరోజు నుంచి విశాఖ లో మ్యాచ్ అటు ఇటు గానే అంటున్నారు. మరి మేకర్స్ అయితే ఈ ప్రమోషన్స్ ఎలా చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు. మార్చ్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :