“దసరా” కి హిందీలో కూడా మంచి రెస్పాన్స్.!

Published on Mar 15, 2023 7:06 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ‘నాటు’రల్ హీరోగా మారిపోయి చేసిన పక్కా మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “దసరా”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే అవైటెడ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ నెక్స్ట్ మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ కి ఎలాగో సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయం అని తెలిసిందే.

కాని నాని ఫస్ట్ పాన్ ఇండియా ఎంట్రీ హిందీలో కూడా ఈ ట్రైలర్ కి 24 గంటలు కంప్లీట్ కాకుండా నే మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. దీనితో ఖచ్చితంగా తెలుగు తర్వాత హిందీ మార్కెట్ దసరా ఎఫెక్ట్ గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :