మాస్ ర్యాంపేజ్ తో “దసరా” ట్రైలర్ రెస్పాన్స్.!

Published on Mar 15, 2023 12:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మంచి అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిచిన సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రం “దసరా”. నాని కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే థియేట్రికల్ ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు.

మరి ఈ ట్రైలర్ కి పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ రెస్పాన్స్ అయితే రిజిస్టర్ అవుతుండడం విశేషం. మరి ఈ ట్రైలర్ కి అయితే ఇప్పుడు అన్ని భాషల్లో 12 మిలియన్ కి పైగా వ్యూస్ రాగ 4 లక్షలకి పైగా లైక్స్ అందుకోవడం విశేషం. దీనితో దసరా ర్యాంపేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక 24 గంటల్లో అయితే ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మార్చ్ 30 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :