ఆసుపత్రిలో చేరిన దర్శకరత్న దాసరి!


తెలుగులో దర్శకుడు అనే పదానికి ఒక క్రేజ్ తెచ్చిన దర్శకుడిగా పేరుగాంచిన దర్శకరత్న దాసరి నారాయణరావు హైద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం ఐసీయూలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, రెండు, మూడు రోజుల్లో కోలుకుంటారని ఆసుపత్రి సిబ్బంది నుంచి అందిన సమాచారం. ఆసుపత్రికి సంబంధించిన నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్సను అందిస్తోంది. దాసరి నారాయణరావు ఆరోగ్యం కుదుట పడి, త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.