లేటెస్ట్..”కేజీయఫ్ 2″ పవర్ఫుల్ ఫస్ట్ సాంగ్ కి సమయం ఖరారు.!

Published on Mar 18, 2022 12:54 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాఫ్టర్ 2” కోసం గాని దీనిపై నెలకొన్న అంచనాలు కోసం గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతే కాకుండా చాప్టర్ 1 అతి పెద్ద హిట్ కావడంతో చాప్టర్ 2 కోసం అన్ని భాషల్లో రికార్డులు నెలకొల్పడం ఖాయంగా ఈ సీక్వెల్ సిద్ధం అవుతుంది.

మరి ఈ సినిమా మొదటి భాగం పెద్ద హిట్ కావడానికి బిగ్ ప్లస్ అయ్యిన రవి బాసృర్ సంగీతం నుంచి ఇపుడు బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చెయ్యడానికి టైం మరియు డేట్ ని ఫిక్స్ చేశారు. దీని ప్రకారం “తూఫాన్” అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసిన ఈ సాంగ్ ని ఈ మార్చ్ 21న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :