లేటెస్ట్..రామ్ మాస్ ప్రాజెక్ట్ “వారియర్” టీజర్ కి డేట్, టైం ఫిక్స్.!

Published on May 8, 2022 12:00 pm IST

టాలీవుడ్ ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ సినిమాల స్పెషలిస్ట్ అయినటువంటి ఎన్ లింగుసామి తెరకెక్కించిన సాలిడ్ మాస్ ప్రాజెక్ట్ “ది వారియర్” కోసం అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర రెండు సాలిడ్ హిట్స్ అనంతరం రామ్ చేసిన సినిమా ఇది కావడంతో పైగా క్రేజీ కాంబోలో కావడంతో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ కూడా వచ్చి మంచి హిట్ కాగా మేకర్స్ ఇప్పుడు ఇంకో అదిరే అప్డేట్ ని అందించారు. ఈ సినిమా నుంచి అవైటెడ్ హై వోల్టేజ్ యాక్షన్ టీజర్ ని ఈ మే 14న సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ మరియు టైం లను అనౌన్స్ చేసేసారు. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :