లేటెస్ట్ : “సలార్” నుంచి మాస్ బ్లాస్ట్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్..!

లేటెస్ట్ : “సలార్” నుంచి మాస్ బ్లాస్ట్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్..!

Published on Aug 13, 2022 2:09 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా “సలార్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా అందులోని మాస్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి అనౌన్స్ చేసిన చిత్రం ఇది. దీనితో జస్ట్ అనౌన్సమెంట్ నుంచే మాసివ్ డీల్స్ సొంతం చేసుకున్న ఈ భారీ సినిమా విషయంలో ఏ చిన్న అప్డేట్ అయినా కూడా ఒక బ్లాస్ట్ లా ఫ్యాన్స్ లో పేలుతుంది.

అందుకే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి అవైటెడ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్ కి మేకర్స్ ఇప్పుడు బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ ని అందించారు. ఈ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకి ఓ క్రేజీ అనౌన్సమెంట్ వస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ తో మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. మరి దీనితో ఏఈ అప్డేట్ సెన్సేషన్ గా ఇప్పుడు మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు