“శ్యామ్ సింగ రాయ్” టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఖరారు.!

Published on Mar 23, 2022 3:36 pm IST

గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ముఖ్యంగా చిట్ట చివరి నెల డిసెంబర్ లో మాత్రం అదిరే సినిమాలు వచ్చాయని చెప్పాలి. ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ కంటెంట్ తో వచ్చి ఇయర్ ఎండింగ్ కి మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ని అందించాయి. ఇక ఈ సినిమాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి.

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం నాని కెరీర్ లోనే సాలిడ్ హిట్ గా నిలవడమే కాకుండా థియేట్రికల్ గా మంచి కం బ్యాక్ సినిమాగా బూస్టప్ ఇచ్చింది. మరి థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటిటి లో వచ్చాక కూడా అదే రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం ఫైనల్ గా టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది.

గత కొన్ని రోజులు నుంచి జెమినీ టీవీ వారు ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యడానికి టీజ్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ వచ్చే ఏప్రిల్ 3న ఆదివారం సాయంత్రం 6 గంటలకి జెమినీ టీవిలో ప్రసారం చేయనున్నట్టుగా తెలిపారు.

ఇక స్మాల్ స్క్రీన్ మీద శ్యామ్ సంచలనం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :