‘ధూమం’ ట్రైలర్ రిలీజ్ డేట్ & టైం లాక్

Published on Jun 6, 2023 7:02 pm IST

ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ లో భన్వర్ సింగ్ షకావత్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఫహాద్ ఫాసిల్. ఇక ప్రస్తుతం పుష్ప ది రూల్ లో కూడా ఆయన కీలక పాత్ర చేస్తున్నారు. మరోవైపు యు టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన రాబోయే పాన్ ఇండియన్ మూవీ ధూమం లో కూడా ఆయన నటించారు. ఈ రోజు, ఈ థ్రిల్లర్ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ అనౌన్స్ మెంట్ వచ్చింది.

కాగా జూన్ 8, 2023 న మధ్యాహ్నం 12 గం. 59 ని. లకు ఈ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు నేడు చిత్ర బృందం ప్రకటించింది. సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నందున ఫహద్ ఫాసిల్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ధూమం ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా లో ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి కథానాయికగా నటిస్తుండగా, దీనిని హోంబలె ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీగా నిర్మించారు. ఈ సినిమాకి పూర్ణచంద్ర తేజస్వి సంగీత దర్శకుడు. ఇక ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :