పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అవైటెడ్ పాన్ ఇండియా సినిమా అందులోని తన మొదటి పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడిలు తెరకెక్కించగా రీసెంట్ గానే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ “మాట వినాలి” మంచి ట్రీట్ ఇచ్చింది.
అయితే ఈ సాంగ్ తో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా 5 భాషల్లో కూడా తానే ఈ పాట పాడి ట్రీట్ ఇవ్వడం విశేషం. ఒకో భాషలో పవన్ పాడిన తీరు, ఆ వైవిధ్యత చూసి పవన్ ఫ్యాన్స్ షాకయ్యారు. దీనితో అసలు ఈ సాంగ్ వెనుక ఏం జరిగింది అనేది రివీల్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.
ఈ జనవరి 29న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి ఆ సాంగ్ రికార్డింగ్ మేకింగ్ వీడియో లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో అభిమానులు ఈ వీడియో కోసం ఇపుడు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 28నే సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
The energy behind the powerful vocals! ???? BTS video of #HariHaraVeeraMallu's 1st single will be out on 29th Jan @ 2:10 PM! ???????? #HHVM 1st Single – https://t.co/5ObGwP2Rc6 #MaataVinaali #BaatNirali #KekkanumGuruve #MaathukeLayya #KelkkanamGuruve
Sung by the one and only,… pic.twitter.com/CKhRnjnHzO
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 28, 2025