అఖిల్ నిశ్చితార్థానికి ముహుర్తం ఖరారు!
Published on Nov 1, 2016 7:01 pm IST

akhil
అక్కినేని అఖిల్.. కొద్దికాలంగా సోషల్ మీడియాలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన పేరు. భారీ అంచనాల మధ్యన గతేడాది విడుదలైన అతడి మొదటి సినిమా ‘అఖిల్’ పరాజయం పాలవ్వడంతో ఆయన రెండో సినిమా ఏమై ఉంటుందన్నది అప్పట్నుంచీ ఏదో ఒక వార్తగా వినిపిస్తూనే వచ్చింది. ఇక కొద్దికాలంగా అఖిల్ తన వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కు చెందిన శ్రేయాతో ప్రేమలో ఉన్న అఖిల్, వచ్చే ఏడాది సమ్మర్ లోపే పెళ్ళి కూడా చేసుకుంటారని ఆయన తండ్రి కింగ్ నాగార్జున ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇక తాజాగా ఈ పెళ్ళికి సంబంధించిన పనులు కూడా మొదలైపోవడం విశేషంగా చెప్పుకోవాలి. డిసెంబర్ 9న హైద్రాబాద్‌లోని జీవీకే హౌస్‌లో పెద్ద ఎత్తున అఖిల్ నిశ్చితార్థం జరగనుందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అక్కినేని కుటుంబం చక్కబెడుతోంది. కింది ఫోటోలో అఖిల్ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్‌ను చూడొచ్చు. ఇక అఖిల్ అన్నయ్య నాగ చైతన్య మాత్రం అఖిల్ పెళ్ళి తర్వాతే తన పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఆసక్తికర అంశం.

akhil-mrg

 
Like us on Facebook