“సర్కారు వారి” సూపర్ మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్, వేదిక ఖరారు.!

Published on May 5, 2022 11:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల మహేష్ ని నెవర్ బిఫోర్ గా ప్రెజెంట్ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేసేసారు.

అనుకున్నట్టుగానే ఈ మే 7న డేట్ ఫిక్స్ చేసి హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అత్యంత ఘనంగా ఈ ఈవెంట్ ని సాయంత్రం 6 గంటల నుంచి చేయబోతున్నట్టు ఒక ప్లెజెంట్ పోస్టర్ ని రిలీజ్ చేసి మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ ఈవెంట్ తో మహేష్ అభిమానులకి మాస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :