బజ్..”భీమ్లా నాయక్” మాస్ టీజర్ కి డేట్ ఫిక్స్.?

Published on Nov 25, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మరో హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న భారీ సినిమా “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక అన్ని పనులు శరవేగంగా కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి సరికొత్త టీజర్ అప్డేట్ కి మేకర్స్ డేట్ ఫిక్స్ చేస్తున్నారట.

లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే వచ్చే డిసెంబర్ 15న కానీ 14న కానీ పవన్ భీమ్లా నాయక్ మరియు రానా డానియల్ శేఖర్ లుగా కనిపించే సాలిడ్ మాస్ టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :