కళ్యాణ్ రామ్ భారీ సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్.!

Published on Nov 27, 2021 1:00 pm IST

నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “బింబిసారా”. సైలెంట్ గా అనౌన్స్ చేసిన ఈ చిత్రం అప్పుడు అనౌన్స్ చేసిన నాటికే చాలా మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని షాకిచ్చింది. చాలా కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు వశిష్ట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అయితే మళ్ళీ అనౌన్సమెంట్ తర్వాత నుంచి శరవేగంగా మిగతా షూట్ ని మేకర్స్ కంప్లీట్ చేశారు.

మరి ఈ తర్వాత ఈ చిత్రం కూడా డిసెంబర్ లో రిలీజ్ కి వస్తుంది అని టాక్ రాగా దీనికి రిలేటెడ్ గా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సాలిడ్ టీజర్ కి డేట్ ఫిక్స్ చేసారు. తమ బార్బేరియన్ కింగ్ టీజర్ తో ఈ డిసెంబర్ 29న రాబోతున్నాడని కన్ఫర్మ్ చేసారు. ఆల్రెడీ గ్లింప్స్ లో అదిరే విజువల్స్ ని మేకర్స్ చూపించారు. మరి టీజర్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :