కార్తికేయ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ కి డేట్ ఫిక్స్.!

Published on Oct 30, 2021 5:07 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగానే కానుక విలన్ గా కూడా పలు స్ట్రాంగ్ రోల్స్ చేస్తూ లైనప్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ లైనప్ లో కార్తికేయ హీరోగా చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా “రాజా విక్రమార్క”. మెగాస్టార్ సినిమా టైటిల్ తో లాంచ్ అయ్యి టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ ను అందుకున్నాడు.

మరి ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు ఎట్టకేలకి ఫిక్స్ అయ్యింది. సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ని వచ్చే నవంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో కార్తికేయ ఇంటెలిజెన్స్ స్పై గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ ఈ సినిమా పట్ల కాస్త ఆసక్తిగానే ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా 88రామా రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More