మెగా బ్లాస్ట్ : “గాడ్ ఫాథర్” టీజర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

మెగా బ్లాస్ట్ : “గాడ్ ఫాథర్” టీజర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

Published on Aug 18, 2022 1:14 PM IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు మోహన్ రాజా తో చేస్తున్న చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కూడా సాలిడ్ బజ్ ని తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ ఆగస్ట్ లో మెగాస్టార్ బర్త్ డే ఈ 22న వస్తుండగా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ ప్లాన్స్ కూడా చేసారు. అయితే ఈ బర్త్ డే కి గాను మెగాస్టార్ నటిస్తున్న చిత్ర నుంచి కూడా మంచి ట్రీట్ లు రెడీగా ఉండగా వాటిలో మొదటిది “గాడ్ ఫాథర్” నుంచి మెగా బ్లాస్ట్ కి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.

ఈ చిత్రం నుంచి అవైటెడ్ టీజర్ ని ఈ ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అధికారిక అనౌన్సమెంట్ అందించారు. మరి దీనిపై డిజైన్ చేసిన పోస్టర్ లో మెగాస్టార్ సాలిడ్ లుక్స్ తో అదిరే లెవెల్లో కనిపిస్తుంది. మరి దీనికి ఇంకా టైం రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి గాను థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు