“టక్ జగదీష్” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్.!

Published on Nov 16, 2021 9:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “టక్ జగదీష్”. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం పలు కారణాల చేత నేరుగా ఓటిటి లోనే రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి మిక్సిడ్ టాక్ నే తెచ్చుకున్నా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా నచ్చింది. వారికి నచ్చితే సినిమా ఫలితం కోసం ఓవరాల్ గా చెప్పనక్కర్లేదు.

మరి ఇప్పుడు ఈ చిత్రం ఎట్టకేలకు స్మాల్స్ స్క్రీన్ పై టెలికాస్ట్ కి సిద్ధం అయ్యింది. స్టార్ మా వారు ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఈ చిత్రం ఈ వచ్చే ఆదివారం నవంబర్ 21న సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ హౌస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More