నిఖిల్ “18 పేజెస్” ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

నిఖిల్ “18 పేజెస్” ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Nov 18, 2022 10:15 AM IST

మన టాలీవుడ్ లో తన సినిమాలకు అంటూ సెపరేట్ ఆడియెన్స్ ని సెట్ చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఒకడు. మరి నిఖిల్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “కార్తికేయ 2” తన కెరీర్ లోనే భారీ హిట్ కాగా ఇప్పుడు ఈ ఏడాదిలో మరో చిత్రం “18 పేజెస్” రిలీజ్ తో రెడీగా ఉన్నాడు. సుకుమార్ రైటింగ్స్ నుంచి దర్శకుడు పళని సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ అందించారు.

మరి నన్నయ రాసిన అనే లైన్ తో ఈ పాటని మేకర్స్ ఈ ఈ నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఓ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు