బాలయ్య – పవన్ పవర్ఫుల్ ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్..!

బాలయ్య – పవన్ పవర్ఫుల్ ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్..!

Published on Dec 16, 2022 4:00 PM IST

లేటెస్ట్ గా మన తెలుగు ఓటిటి దగ్గర సెన్సేషన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు నందమూరి నటసింహ బాలయ్య చేస్తున్న “అన్ స్టాప్పబుల్ సీజన్ 2” మాసివ్ ఎపిసోడ్ కోసం నెక్స్ట్ లెవెల్ హైప్ సెట్ అవుతుండగా ఇక దీని తర్వాత మరి బిగ్గెస్ట్ ఎపిసోడ్ ని అయితే ఆహా వారు ప్లాన్ చేశారు. మరి దీనిని అధికారికంగా అనౌన్స్ చేసేయగా పవర్ స్టార్ మరియు బాలయ్య లు కలిసి కనిపించే ఈ మాసివ్ ఎపిసోడ్ కోసం అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఉన్నారు.

మరి దీనిపై అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సాలిడ్ ఎపిసోడ్ అయితే ఈ డిసెంబర్ 27న షూటింగ్ జరుపుకోనున్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ అయ్యింది. దీనిపై యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఓ ట్వీట్ చేయగా దానికి ఆహా వారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఆరోజు అయితే మోత మోగడం గ్యారెంటీ అని చెప్పాలి. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉండగా బాలయ్య ఈ షో సహా వీరసింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు